ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ అగ్నిప్రమాదం.. 35 మంది మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
ఫిలిప్పీన్స్‌లో ఎమ్వీ జూన్ ఆస్టర్ పడవలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 35కు చేరింది. మనీలా నుంచి పలవాన్‌కు వెళ్తుండగా కోరాన్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. పడవలో మొత్తం 137 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో మరో 54 మంది ఆచూకీ గల్లంతు కాగా, 43 మందిని రక్షించారు. దట్టమైన పొగ, విపరీతమైన వేడి కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.