ఉపాధ్యాయులపై రాజకీయ దాడులు సరికాదన్న ఏపీ చైర్మన్ కేకే చౌదరి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయవాడ

విజయవాడలో ఉపాధ్యాయులపై జరిగిన రాజకీయ ఘర్షణలను ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి తీవ్రంగా ఖండించారు. ఉద్యోగాలు సాధించిన యువతను రాజకీయ ప్రయోజనాల కోసం అవమానించడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ధ్రువపత్రాలపై అనుమానాలు ఉంటే అధికారుల ద్వారా విచారణ జరిపించాలే తప్ప, రోడ్డుపై వివాదాలకు దిగడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. గురువులను గౌరవించడం సమాజ బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.