హైటెక్ సిటీ స్టేషన్లో పది ప్రధాన రైళ్లకు తాత్కాలిక హాల్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో పది ప్రధాన రైళ్లకు తాత్కాలిక స్టాపులు కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ వెల్లడించారు. నవంబరు 1 నుంచి జనవరి 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో రద్దీని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఉచితంగా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చని సూచించారు.