కడ్తాల్ పోలీస్ స్టేషన్ తనిఖీ.. ఏసీపీ డా. జానకి రెడ్డి ఆదేశాలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
మహేశ్వరం అసిస్టెంట్ కమిషనర్ డా. జానకి రెడ్డి కడ్తాల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
ప్రజా ఫిర్యాదులను అత్యంత మర్యాదతో స్వీకరించి, బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దుని, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు.