కుమారస్వామి నివాసంలోనే స్టింగ్ ఆపరేషన్ ఫోన్: బెంగళూరు పోలీస్ కమిషనర్ సంచలనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Bengaluru
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను టార్గెట్ చేస్తూ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఉపయోగించిన మొబైల్ ఫోన్ ను కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి అధికారిక నివాసంలో అందజేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమ కుమార్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీలోని కరాల్ బాగ్ లో కొనుగోలు చేసిన ఈ ఫోన్ ను కుమారస్వామి నివాసంలో ప్రజ్వల్ ప్రసాద్ కు అందించినట్లు నిందితుడి వాంగ్మూలం ద్వారా తేలిందని ఆయన స్పష్టం చేశారు.