స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి: వెంకయ్యనాయుడు
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
గ్రామీణ ప్రాంతాల పేద యువతను నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడమే స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నెల్లూరులో జరిగిన ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ, వసతి కల్పిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని వెంకయ్యనాయుడు భావోద్వేగంగా వెల్లడించారు.