కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు
రిపోర్టర్: RAMESH LAVETI
స్థలం: రాజాం
రాజాం మండలం డోలపేట గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. ఈ ప్రాంతంలో కొలువైన అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నారని స్థానికులు విశ్వసిస్తున్నారు. ప్రతి నిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారని, అమ్మవారి ఆశీసులు పొందుతున్నారని భక్తులు తెలిపారు.