షాకింగ్ ఘటన: భార్యను హత్య చేసిన మాజీ పాస్టర్కు జీవిత ఖైదు
రిపోర్టర్: సురేష్
స్థలం: Ohio
అమెరికాలోని ఒహియోలో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో కేలేబ్ ఫ్లిన్ అనే మాజీ పాస్టర్కు కోర్టు జీవిత ఖైదు విధించినట్లు జిల్లాల న్యాయాధికారులు తెలిపారు. వివాహేతర సంబంధం మోజులో పడి భార్య యాష్లే ఫ్లిన్ను దారుణంగా కాల్చి చంపి, దోపిడీ దొంగల హత్యగా నమ్మించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.