తీవ్ర తుఫాను ముప్పు: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రానున్న మూడు గంటల్ లో కొన్ని జిల్లాల్ లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఎవరూ ప్రయాణాలు చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు.