భారత్ మార్కెట్లోకి లావా విరాట్ కర్వ్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: భారతదేశం
భారతీయ మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ బ్రాండ్ లావా సంస్థ సరికొత్తగా లావా విరాట్ కర్వ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ మరియు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తోంది. దీని ధర రూ. 23,999 ఉండగా, బ్యాంకు డిస్కౌంట్లతో రూ. 19,999 లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.