థియేటర్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

సినిమా రంగంలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా థియేటర్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి హైదరాబాద్లో అత్యాధునిక హంగులతో మల్టీప్లెక్స్ల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు కుషాయిగూడలోనూ ఈ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, 2027 సంక్రాంతి నాటికి ఇవి ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు.