నేడు 48 మందికి జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ జాతీయ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. విద్యారంగంలో విశేష కృషి చేసిన వారిని సత్కరించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు చోటు దక్కించుకోవడం విశేషం. బోధనా పద్ధతుల్లో వినూత్న మార్పులు తెచ్చిన గురువులను ప్రభుత్వం ఈ వేదికపై ఘనంగా గౌరవించనుంది.