ఖమ్మంలో ఉప్పొంగుతున్న బేతుపల్లి చెరువు: బోట్లు బోల్తా పడి SDRF సిబ్బంది గల్లంతు

రిపోర్టర్: మహేష్ స్థలం: ఖమ్మం

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో వరద ఉప్పొంగుతుండగా మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో గల్లారిన సిబ్బందిని రక్షించేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.