ఇబ్రహీంబాద్లో ఘనంగా జాతీయ పోషణ మహోత్సవ వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ పోషణ మహోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కె.కృష్ణమ్మ పాల్గొని పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవ విజయాల నేపథ్యంలో ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులను ఘనంగా సన్మానించారు.