కొయ్యూరు మండలంలో ప్రశాంతంగా రవాణాపల్లి పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలంలోని రవాణాపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిణి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూడా రమణమ్మ పాఠశాల చైర్మన్గా, కూడా కనకమహాలక్ష్మి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ విద్యార్థుల వసతి, విద్య అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.