స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి షాక్: హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పెంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని అధికారులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసిందని, సోమవారం నుంచి పరిశీలన ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయస్థానానికి వివరించింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసినట్లు వెల్లడించారు. దీంతో గడువు పెంపుపై ఆశలు పెట్టుకున్న పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.