మణిపూర్ హింసాకాండ విచారణ కమిషన్ గడువు మరో ఏడాది పొడిగింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు మరియు హింసాకాండపై విచారణ జరుపుతున్న కమిషన్ గడువును కేంద్ర కేబినెట్ మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనితో ఈ కమిషన్ తన నివేదికను సమర్పించడానికి 2027 మే 20 వరకు సమయం లభించింది. 2023 సెప్టెంబర్ లో ఏర్పాటైన ఈ దర్యాప్తు కమిషన్ కు గడువు పొడిగించడం ఇది ఆరోసారి కావడం గమనార్హం.