ఆదిలాబాద్లో కుష్ఠు వ్యాధి గుర్తింపు ఉద్యమం: స్పష్టమైన లక్షణాలతో అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: శివ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధి గుర్తింపును పకడ్బందీగా చేపట్టాలని, అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కుష్ఠు నియంత్రణ కార్యక్రమ అధికారి ఈశ్వర్ రాజు సూచించారు. మావల మండలంలోని దుబ్బగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్ఠు గుర్తింపు ఉద్యమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. తెల్లమచ్చలు, తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా ఆశా కార్యకర్తల ద్వారా పరీక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.