పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ప్రాకాశం
ప్రకాశం జిల్లా కనిగిరి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పనితీరుపై మార్కాపురం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మరియు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.