హైదరాబాద్లో భవన నిర్మాణాలపై తాగునీరు నిషేధం: కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరతను నివారించేందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన శుక్రవారం స్పష్టం చేశారు. నగరంలో చేపడుతున్న భవన నిర్మాణాలు, ఫ్లైఓవర్లు, అండర్పాస్ల పనులకు మంచి నీరు లేదా బోరు నీటిని వాడకూడదని ఆమె తెలిపారు. కేవలం రీసైకిల్ చేసిన శుద్ధి నీటిని మాత్రమే ఉపయోగించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు.