తాజ్‌పూర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం.. నిఘా నీడలో గ్రామం
రిపోర్టర్: Madhu Bngr
స్థలం: భువనగిరి
భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైర్లెస్ సీసీ కెమెరాలను సీఐ ఎన్. చంద్రబాబు, ఎస్హెచ్ఓ అనిల్ కుమార్ ప్రారంభించారు. గ్రామాన్ని నిఘా పరిధిలోకి తీసుకురావడంపై సర్పంచ్‌ను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ద్వారా నేరాలు, దొంగతనాలు, సంఘ విద్రోహ చర్యలను అరికట్టడంతో పాటు దర్యాప్తులో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ యువత పాల్గొన్నారు.