రాజాపేటలో పంట కుంట పనుల ప్రారంభం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజపేట మండలం కుర్రారం గ్రామ పరిధిలోని రేకులపల్లి మల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా పంట కుంట నిర్మాణ పనులను సోమవారం సర్పంచ్ బొడ్డు భాస్కర్ ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు రైతులు పంట కుంటలు నిర్మించుకోవాలని ఆయన సూచించారు.
భవిష్యత్ తరాలకు నీటి వనరులు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రావి కొండల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ జింగిటి మధులత, రేకులపల్లి మల్లారెడ్డితో పాటు పలువురు కూలీలు తదితరులు పాల్గొన్నారు.