గుజరాత్లో చింతన్ శిబిర్ ప్రారంభం: కేంద్రమంత్రితో కలిసి కీలక చర్చల్లో వెంకట్ రెడ్డి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నల్గొండ
గుజరాత్లోని ఏక్తా నగర్ వద్ద ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీలో రెండు రోజుల పాటు నిర్వహించే చింతన్ శిబిర్ 2026ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించినట్లు Komatireddy Venkat Reddy వెల్లడించారు. పీఎం గతి శక్తి, భూసేకరణ, గ్రీన్ హైవేలు మరియు రోడ్ల అభివృద్ధి వంటి ఆరు కీలక అంశాలపై సమగ్రమైన చర్చలలో తాను పాల్గొన్నట్లు తెలిపారు.