రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా డెమోక్రాట్ ప్రతినిధి రాజా కృష్ణమూర్తి ఓటు
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
అమెరికా ప్రతినిధుల సభలో రష్యాపై ఆంక్షల బిల్లు ఓటింగ్ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి రాజా కృష్ణమూర్తి తన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఓటు వేసి సంచలనం సృష్టించారు. రష్యా చమురు దిగుమతులపై సుంకాలు విధించే ఈ బిల్లును డెమోక్రాట్ పార్టీకి చెందిన రో ఖన్నా, ప్రమీలా జయపాల్ తదితరులు వ్యతిరేకించగా, రాజా కృష్ణమూర్తి మాత్రం ట్రంప్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.