దస్తురాబాద్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. లబ్ధిదారుల హర్షం

రిపోర్టర్: Gone Rachana స్థలం: దస్తురాబాద్

దస్తురాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచి వర్దిల్లి గోపాల్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయికుమార్తో కలిసి అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.