పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా ట్రిపుల్ సెంచరీ

రిపోర్టర్: సతీష్ స్థలం: పాకిస్థాన్

ఇంగ్లాండ్ టూర్ నుంచి అర్ధంతరంగా వెనక్కి పంపబడిన పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా దేశవాళీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రెసిడెంట్స్ ట్రోఫీలో కింగ్స్‌మెన్ అకాడమీ తరఫున ఆడిన సల్మాన్, మార్ఖోర్ ఐటీ సొల్యూషన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 300 పరుగులు సాధించాడు. 336 బంతుల్లోనే 42 ఫోర్లు, 6 సిక్సర్లతో ఈ ఘనత సాధించి తన ఫామ్ నిరూపించుకున్నాడు.