ఐస్క్రీమ్ బార్లో కాలిగోరు ప్రత్యక్షమంటూ విదేశీ మహిళ ఆవేదన
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
ప్రముఖ ఆన్లైన్ బ్రాండ్ ఐస్క్రీమ్లో మానవ కాలిగోరు వచ్చిందంటూ రష్యాకు చెందిన మహిళా సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత్లో ఉంటున్న పోల్ ఎక్స్ప్లోరర్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తాను ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్ బార్లో విదేశీ వస్తువు లాంటి కాలిగోరును గుర్తించినట్లు తెలిపారు. అది వంగుతోందని, రంగు కూడా అసహ్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఆహార ఉత్పత్తుల నాణ్యతపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.