ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా మను బాకర్, తజిందర్‌పాల్ సింగ్ తూర్
రిపోర్టర్: నరేష్
స్థలం: India
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగే ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత్ తరఫున డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్, షాట్ పుట్ అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన షూటర్ మను బాకర్, రెండుసార్లు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత తూర్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. భారత చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా వెల్లడించాయి.