ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలు: పీవీ సింధు, మీరాబాయి చానుకు చోటు
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
భారత ఒలింపిక్ సంఘం అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు రిటర్నింగ్ అధికారి సంజయ్ కె శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ జాబితాలో స్టార్ షట్లర్ పీవీ సింధు, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులతో పాటు పలువురు ప్రముఖ క్రీడాకారులకు చోటు దక్కింది. అయితే గతంలో డోపింగ్ వివాదంలో నిలిచిన లవ్‌ప్రీత్ సింగ్ అర్హతపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.