టెక్ మార్కెట్లో శాంసంగ్ W27 ఫోల్డబుల్ ఫోన్ లాంచ్: ధర ఎంతంటే

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన సరికొత్త లగ్జరీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ శాంసంగ్ W27 ను చైనా మార్కెట్లో లాంచ్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్మార్ట్ఫోన్ 8 అంగుళాల ప్రధాన డిస్ప్లే, 200 మెగాపిక్సెల్ కెమెరా మరియు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తోందని తెలిపారు. చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రెండు లక్షల ఇరవై వేల రూపాయలకు పైగా ఉంటుందని, త్వరలోనే ఇతర మార్కెట్లకు రానుందని నిపుణులు పేర్కొన్నారు.