దేశంలోకి డెంగ్యూ తొలి టీకా క్యూడెంగ్యూ రాక

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

డెంగ్యూ నివారణకు తొలి టీకా క్యూడెంగ్యూ వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో దేశీయంగా అందుబాటులోకి రాబోతున్నది. జపాన్‌కు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకున్నది. దేశంలోని ప్రైవేట్ మార్కెట్‌లో ఈ టీకాను డాక్టర్ రెడ్డీస్ పంపిణీ చేయనుందని, 4 నుంచి 40 ఏండ్ల వయసున్న వారు ఈ టీకా వేసుకోవాల్సి ఉంటుందని ఇరు సంస్థలు వెల్లడించాయి.