ఢిల్లీలో తీవ్ర కలకలం: సీఈసీ రాజీనామా కోసం సీజేపీ నిరసనలు
రిపోర్టర్: మహేష్
స్థలం: ఢిల్లీ
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, దేశ రాజధానిలో అత్యయిక పరిస్థితిని తలపించే వాతావరణం నెలకొందని సీజేపీ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా విమర్శించారు. నిరసనలు కొనసాగుతాయని నేతలు స్పష్టం చేశారు.