క్లాసికల్ డాన్స్ లో అదరగొట్టి రాష్ట్రస్థాయిలో మెరిసిన రేణుశ్రీ
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని పీఎంశ్రీ పాఠశాల విద్యార్థిని రేణుశ్రీ క్లాసికల్ డాన్స్ లో అద్భుత ప్రతిభ చాటింది. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన ఆమె, హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థినిని అభినందించారు.