హనుమకొండలో అగ్నిప్రమాదం రూ. నాలుగు కోట్ల ఆస్తి నష్టం

రిపోర్టర్: సురేష్ స్థలం: హనుమకొండ

హనుమకొండ వడ్డేపల్లి జవహర్ నగర్ క్రాస్ వద్ద ఉన్న సరస్వతి ఎంటర్ప్రైజెస్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి అగ్ని రవ్వలు పడి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ దుర్ఘటనలో దాదాపు నాలుగు కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు భూక్య బద్రు నాయక్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.