సౌదీలో ఉగ్రదాడుల వీడియోలు తీస్తే చట్టపరమైన చర్యలు: భారత్ హెచ్చరిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

సౌదీ అరేబియాలో హౌతీ ఉగ్రవాదుల డ్రోన్, మిస్సైల్ దాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు తెచ్చినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. దాడుల దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం నిషిద్ధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల విమాన సర్వీసులు రద్దయ్యాయని, భారతీయులు స్థానిక చట్టాలను గౌరవిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.