సోమశిల కాలువల నిర్వహణ నిధుల అవినీతిపై విజిలెన్స్ విచారణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
సోమశిల ప్రాజెక్టు కాలువల నిర్వహణ పనుల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఫ్లడ్ డ్యామేజీ రిపేర్స్ కింద మంజూరైన కోట్ల రూపాయల నిధులను అధికారుల అండతో బినామీ కాంట్రాక్టర్లు కాగితాలకే పరిమితం చేసి కొల్లగొట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని కలువాయి, చేజర్ల మండలాల్లో నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించి, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయకుండానే భారీగా బిల్లులు స్వాహా చేసిన వైనంపై సర్వత్రా విచారణ ముమ్మరమైంది.