బిగ్ బాస్ హౌస్లోకి విశాఖ యువతి శివసృష్టి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విశాఖపట్నం
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 మెయిన్ హౌస్లోకి విశాఖ యువతి శివసృష్టి వ్యాకరణం ఎంపికైనట్లు సమాచారం. అగ్నిపరీక్ష షోలో అద్భుత ప్రదర్శన కనబరిచి టాప్-15లో నిలిచిన ఆమె, వీక్షకుల ఓటింగ్ మరియు ప్రతిభ ఆధారంగా నేటి నుంచి ప్రారంభం కానున్న మెయిన్ షోకు అర్హత సాధించారు.
గత సీజన్లో ఉత్తరాంధ్రకు చెందిన దివ్వెల మాధురి సందడి చేయగా, కళ్యాణ్ పడాల విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు శివసృష్టి ఎంపికతో విశాఖ వాసుల్లో ఉత్సాహం నెలకొంది. ఆమె ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.