కేతన్ అగర్వాల్ హత్య కేసులో పుణె కోర్టులో ఐదు వేల పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: పుణె
పుణెలోని లోహగడ్ కోటలో జరిగిన సంచలనాత్మక కేతన్ అగర్వాల్ హత్య కేసులో శనివారం పుణె కోర్టులో పోలీసులు 5,053 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ హత్యోదంతంలో మృతుడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, మరో నిందితుడు రితేష్ హాంగెలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులు హత్యకు ముందు చాట్‌జీపీటీని ఉపయోగించడం, హత్యల గురించిన చిత్రాలు చూడటంతో పాటు మేఘాలయ హనీమూన్ హత్య కేసును కూడా పరిశోధించినట్లు చార్జిషీట్‌లో వెల్లడించారు.