తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
రిపోర్టర్: సునీల్
స్థలం: Tirupati
గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిన మాట నిజమేనని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో విలేకర్లతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. తిరుమలలో రూ.658కే నాణ్యమైన నెయ్యి సరఫరా సాధ్యం కాదని అన్నారు. భవిష్యత్తులో టీటీడీ బోర్డును పూర్తిగా రద్దు చేసి కేవలం మఠాధిపతులు, పీఠాధిపతులకే స్థానం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.