మోసపోయిన ప్లాట్ల బాధితుల ఆందోళనతో దద్దరిల్లిన రాజాపేట

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం చల్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ లో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్ మోసం చేశారంటూ నిరసన తెలుపుతూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తమకు అన్యాయం జరగకుండా చూడాలని, కోట్లు వసూలు చేసి ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేసిన నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.