22ఏ కేసులో రేవంత్ రెడ్డి ఏ1, పొంగులేటి ఏ2: హరీశ్ రావు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో 22ఏ భూముల కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏ1 కాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ2 అని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తన మామ భూముల కొనుగోలుపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని నిబంధనల ప్రకారమే లావాదేవీలు జరిగాయని స్పష్టం చేశారు.