ఖమ్మం జిల్లాలో ఘనంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో వినాయక చవితి వేడుకల ముగింపు సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన ప్రాంతాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.