ఎంజీఆర్ బయోపిక్: జయలలిత పాత్ర కోసం నటి త్రిషతో సంప్రదింపులు
రిపోర్టర్: సురేష్
స్థలం: చెన్నై
ఎంజీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పురట్చి తలైవర్ చిత్రంలో జయలలిత పాత్ర కోసం ప్రముఖ నటి త్రిషను సంప్రదిస్తున్నట్లు నటుడు జె.ఎం.బషీర్ వెల్లడించారు. తన కుమార్తె స్నేహితురాలైన త్రిషతో ఈ ప్రాజెక్ట్ విషయమై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఆమె ఇంకా అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక నూతన నూతన నటీనటుల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోందని మేకర్స్ తెలిపారు.