వారణాసి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామా వారణాసి చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ పూర్తిగా పూర్తయింది. ఈ భారీ ప్రాజెక్టు నుంచి మహేష్ బాబు తన షెడ్యూల్‌ను ముగించుకుని సెట్స్‌కు వీడ్కోలు పలికారు. రాజమౌళి మేకింగ్‌లో హాలీవుడ్ స్థాయిలో వస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.