మణిపూర్ లో ఘోర కాల్పులు: ప్రత్యర్థి నాగా గ్రూపుల మధ్య గన్ఫైట్ లో ముగ్గురు మృతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మణిపూర్
మణిపూర్ రాష్ట్రంలోని నోనే జిల్లాలో జరిగిన భీకర కాల్పుల ఘటనలో ముగ్గురు మిలిటెంట్లు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రత్యర్థి నాగా గ్రూపుల మధ్య తలెత్తిన ఘర్షణ కారణంగా ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. తావోజైజాంగ్ గ్రామంలో జరిగిన ఈ గన్ఫైట్ లో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత ఆధునిక ఆయుధాలతో జరిగిన ఈ దాడితో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.