అస్సాంలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స కేంద్రం: ప్రభుత్వ రంగంలో దేశంలోనే తొలి ప్రోటాన్ థెరపీ

రిపోర్టర్: శివ స్థలం: Guwahati

అస్సాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గౌహతి మెడికల్ కాలేజీలో ప్రోటాన్ బీమ్ థెరపీ కేంద్రం ఏర్పాటు కోసం బెల్జియం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ప్రకటించారు. రూ.600 కోట్ల వ్యయంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే తొలిసారిగా ఈ అత్యాధునిక క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే అందుబాటులోకి వస్తుందని, రాబోయే మూడు సంవత్సరాలలో ఈ యంత్రం ఏర్పాటు పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు.