మాజీమంత్రి కారుమూరి సిట్ కస్టడీ తొలిరోజు ఎలాంటి విచారణ లేకుండానే ముగింపు

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

మద్యం రవాణా కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సిట్ కస్టడీ తొలి రోజు ఎలాంటి విచారణ జరగకుండానే ముగిసింది. చంచల్గూడ జైలు నుంచి విజయవాడకు తరలించడం, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఆలస్యం కావడంతో కోర్టు గడువు ముగిసింది. దీంతో సిట్ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు అప్పగించారు. నేటి నుంచి తొమ్మిదో తేదీ వరకు జరగనున్న విచారణలో కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు వ్యూహాలు రచిస్తున్నారు.