అమెరికాలో కేన్సర్తో తెలుగు యువకుడు భరత్ పులిపాటి దుర్మరణం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమెరికా

అమెరికాలో కేన్సర్తో తెలుగు యువకుడు భరత్ పులిపాటి తుదిశ్వాస విడిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లిన భరత్, కొంతకాలంగా కేన్సర్తో పోరాడుతూ టెక్సాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన పేర్కొన్నారు. భరత్ మృతిపై మంత్రి లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.