'యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు': గౌరవ్ వల్లభ్
రిపోర్టర్: హరి
స్థలం: ఢిల్లీ
యూపీఐ లావాదేవీల మీద కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని బీజేపీ నేత గౌరవ్ వల్లభ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత లావాదేవీలతో పాటు వ్యాపారులకు చేసే చెల్లింపులలో రెండు వేల రూపాయల వరకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ANI ద్వారా ఆయన వెల్లడించారు. ఈ విధానం వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని, డిజిటల్ పేమెంట్లను మరింత ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.