హైదరాబాద్ లో గుట్టురట్టు: ఉమెన్స్ హాస్టల్ కేంద్రంగా అండాల విక్రయ దందా
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీలో గల శెట్టి ఉమెన్స్ హాస్టల్ కేంద్రంగా మహిళల అండాలను అక్రమంగా సేకరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారని అధికారులు వెల్లడించారు. ఉత్తర రాష్ర్టాల నుంచి యువతులను రప్పించి డబ్బు ఆశ చూపిస్తూ కార్పొరేట్ ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్ లో పదిహేను మంది యువతులను, నిర్వాహకుడు దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు.